Site icon NTV Telugu

Asaduddin Owaisi: పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పోషించడంలో పాకిస్తాన్‌కి సుదీర్ఘమైన చరిత్ర ఉందని అన్నారు. పాకిస్తాన్ మానవాళికి ముప్పుగా మారిందని విమర్శించారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలకు తెలిసేలా 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో అసదుద్దీన్ ఓవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందాలు ప్రపంచంలోని పలు దేశాలకు పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న విషయాన్ని, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై వివరించనున్నాయి.

Read Also: CJI BR Gavai: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌కు సన్మానం

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజానికి తన సందేశంలో తన ప్రధానాంశం ఇదేనని ధృవీకరించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవైసీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా కాలంగా అమాయక పౌరులను వధించడం గురించి ప్రపంచానికి చెప్పాలసిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి భారతదేశం అతిపెద్ద బాధితురాలు అని చెప్పారు. జియా ఉల్ హక్ కాలం నుంచి మనందరం ప్రజల ఊచకోత కోయడం చూశామని ఆయన చెప్పారు.

భారతదేశం ఘర్షణల్లో తనను తాను ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ చూపించుకుంటుందని, భారతదేశంలో 20 కోట్ల మంది నివసిస్తున్నారని అన్నారు. భారతదేశాన్ని అస్థిరపరడచం, మత విభజన ప్రేరేపించడం, దేశ ఆర్థికవృద్ధి ఆపడం పాకిస్తాన్ ఉద్దేశ్యమని చెప్పారు. 1947లో స్వాతంత్ర్యం తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్‌లోకి గిరిజన ఆక్రమణదారులను పంపినప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రణాళికను భారతదేశం చాలా కాలం క్రితమే అర్థం చేసుకుని ఉండాలి అని ఆయన అన్నారు. వారు ఈ తమాషానికి అప్పటి నుంచి చేస్తున్నారని, రేపు కూడా దీన్ని కొనసాగిస్తారని, అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సహనం నశించిందని ఆయన అన్నారు.

Exit mobile version