Site icon NTV Telugu

Asaduddin Owaisi: ట్రంప్ ఒక బఫూన్.. 25% సుంకం వేయడంపై అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్య

Asaduddin Owaisi

Asaduddin Owaisi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వైట్‌హౌస్‌లో ‘బఫూన్ ఇన్ చీఫ్’ అంటూ వ్యాఖ్యానించారు. ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై అసదుద్దీన్ ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. భారత ప్రభుత్వాన్ని బెదిరించడం బాధగా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Kingdom : శ్రీలీల టాలీవుడ్ గ్లామర్ గ్యాప్‌లోకి.. భాగ్యశ్రీ !

ట్రంప్ చర్యలు భారతదేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థితిపై ఉద్దేశపూర్వక దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. భారత ప్రభుత్వాన్ని ‘వైట్ హౌస్‌లోని బఫూన్-ఇన్-చీఫ్’ బెదిరించడం విచారకరమని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పెరుగుతున్న శత్రుత్వాన్ని చాలా సంవత్సరాలుగా పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నట్లు గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై పార్టీలు క్లారిటీకి వచ్చాయా..?

ఆగస్టు 1, 2025 నుంచి అమెరికాకు వచ్చే భారత ఎగుమతులన్నింటిపై 25 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే మరింత జరిమానా కూడా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. భారత్, రష్యా ఏం చేసినా తనకు పట్టింపులేదని తాజాగా ట్రంప్ పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా అమెరికా.. భారతదేశం నుంచి అసమాన నిబంధనలను ఎదుర్కొంటుందన్నారు. ఇక ట్రంప్ విధించిన సుంకాలపై భారతప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

 

Exit mobile version