NTV Telugu Site icon

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ నిరాహార దీక్ష.. లగ్జరీ వ్యాన్పై కొనసాగుతున్న రచ్చ!

Pk

Pk

Prashant Kishor: బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ చీఫ్ ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పట్నాలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యాన్ పీకేకు చెందినది.. అందులో ఏసీ, కిచెన్, బెడ్రూం లాంటి సకల సదుపాయాలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆ వెహికిల్.. వేదిక పక్కన ఉండటంతో సోషల్ మీడియాలో రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక, దీనిపై జన్‌ సురాజ్‌ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆ వ్యాన్‌ అక్కడ ఉండటం అసలు సమస్య కాదు.. ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం విద్యార్థుల భవిష్యత్తు అని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే దానిని మధ్యలోకి లాగుతున్నారని మండిపడ్డారు.

Read Also: Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..

ఇక, డిసెంబర్‌ 13వ తేదీన నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మరోసారి నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఆ పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో ఉద్యోగార్థులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేయగా.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వాళ్లకు సపోర్టుగా నిలిచారు. విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నా నిరసన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

Show comments