ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు 50 కోట్లు, కొవాక్సిన్ డోసులు 40 కోట్లు, బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ డోసులు 30 కోట్లు, జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ డోసులు 5 కోట్లు, స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు 10 కోట్లు అందుబాటులోకి వస్తాయని అఫిడవిట్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. కాగా, ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. మరోవైపు.. రెండేళ్లకు పైబడిన పిల్లపై వ్యాక్సిన్ ట్రయల్ నడుస్తున్న విషయం తెలిసిందే.
తీరిపోనున్న వ్యాక్సిన్ కొరత కష్టాలు..! 135 కోట్ల డోసులు..!

vaccine