Site icon NTV Telugu

Islam- Terrorism: ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం ఉంటుంది.. ఇందులో అనుమానాలొద్దు..!

Tasleem

Tasleem

Islam- Terrorism: ప్రపంచ దేశాల్లో ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం బ్రతికే ఉంటుందని బంగ్లాదేశ్‌ బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్‌ తెలిపారు. పహల్గాం దాడిని, 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో పోల్చారు. ఇక, ఆదివారం నాడు ఢిల్లీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో తస్లీమా మాట్లాడుతూ.. 1400 ఏళ్లైనా ఇస్లాం ఇంకా వికాసం చెందలేదు.. ఇది జరిగే వరకూ.. ఉగ్రవాదులను పుట్టిస్తూనే ఉంటుందని మండిపడింది. కల్మా చదవనందుకు 2016లో ఢాకాలో జరిగిన దాడిలో ముస్లింలను దారుణంగా హత్య చేశారు.. మానవత్వాన్ని, హేతుబద్ధతను కూడా విశ్వాసం అధిగమించినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతుంటాయని రచయిత తస్లీమా నస్రీన్‌ వెల్లడించింది.

Read Also: Terror Threat: జమ్మూలోని జైళ్లపై ఉగ్రవాద దాడి జరిగే ఛాన్స్..

అయితే, ఇస్లాం మతం ఉన్నంత వరకూ ఈ ఉగ్రవాదం ఇలాగే కొనసాగుతుందని రచయిత తస్లీమా నస్రీన్‌ పేర్కొన్నారు. ఐరోపా దేశాల్లో చర్చిలు ప్రదర్శనశాలలుగా మారాయి. కానీ, ప్రతి చోటా మసీదులు కట్టడంలో ముస్లీంలు చాలా బిజీగా ఉన్నారని తెలిపింది. వారు జిహాదీలను ఉత్పత్తి చేస్తున్నారు. అసలు మదర్సాలు అనేవి ఉండకూడదు.. పిల్లలు ఒక పుస్తకాన్ని కాకుండా అన్ని పుస్తకాలూ చదవాలి.. అప్పుడే వారు ఉగ్రవాదం వైపుకు వెళ్లరని నస్రీన్‌ చెప్పుకొచ్చింది.

Exit mobile version