NTV Telugu Site icon

Sunita Kejriwal: నా భర్తను కేంద్రం టెర్రరిస్టులా చూస్తోంది.. బెయిల్ వాయిదాపై కేజ్రీవాల్ భార్య..

Sunita Kejriwal

Sunita Kejriwal

Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని కొట్టేయాలంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈడీ పిటిషన్ విచారించేందుకు కోర్టు అంగీకరించింది.

దీనిపై సునీతా కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఆర్డర్ అప్‌లోడ్ చేయడానికి ముందే బెయిల్‌ని వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఎలా ఆశ్రయించిందని ప్రశ్నించారు. తన భర్తను ప్రభుత్వం, కేంద్ర సంస్థలు వాంటెడ్ టెర్రరిస్టులా చూస్తోందని ఆమె ఆరోపించారు. దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందని, నియంతృత్వం అని పరిమితులను దాటిందని ఆమె అన్నారు.

Read Also: Instagram : ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆన్‌ లైవ్‌’ సరికొత్త ఫీచర్‌ ను తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌..

మరోవైపు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ మోడీ ప్రభుత్వం గుండాయిజం చూడండి. ట్రయల్ కోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు. ఆర్డర్ కాపీ కూడా రాలేదు. మోడీ యొక్క ఈడీ హైకోర్టుకు చేరుకుంది. ఈ దేశంలో ఏం జరుగుతోంది. మోడీజీ మీరు న్యాయ వ్యవస్థను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు.. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది’’ అని ఆయన అన్నారు.

ఈడీ తరుపును అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు ఢిల్లీ హైకోర్టులో వినిపించగా, కేజ్రీవాల్ తురుపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలను వినిపిస్తున్నారు.