Site icon NTV Telugu

పంజాబ్‌​ఆప్​సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన కేజ్రీవాల్.. కానీ..!

పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు హీటు పుట్టిస్తున్నాయి.. మరోసారి అధికారం మాదే అంటోంది కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తమను అధికారాన్ని తెచ్చిపెడతాడని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.. ఇంకో వైపు.. ప్రజలను ఆకట్టుకునే పనిలో పడిపోయింది ఆమ్‌ ఆద్మీ పార్టీ… ఇప్పటికే పలు ఆకర్షణీయమైన హామీలను కూడా కురిపించారు.. తాజాగా, పంజాబ్​ ఆమ్​ ఆద్మీపార్టీ (ఆప్​) సీఎం అభ్యర్థిని కూడా దాదాపుగా ఖరారు చేశారు అరవింద్‌ కేజ్రీవాల్.. పంజాబ్​ సీఎంగా భగవంత్‌ను చేయాలని తాను భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థిపై సూచనప్రాయంగా ఒక ప్రకటన చేశారు ఆప్‌ చీఫ్‌.. పంజాబ్‌ సీఎంగా భగవంత్​మాన్‌ను చేయాలని అనుకుంటున్నాం.. దీనిని ప్రజలే నిర్ణయించాలని పేర్కొన్నాడు.. ఇక, ఇదే సమయంలో.. భగవంత్​మాన్​తనకు చాలా సన్నిహితుడని.. తమ్ముడులాంటివారని పేర్కొన్నారు. కాగా, పంజాబ్‌ ఆప్‌ చీఫ్‌గా ఉన్న భగవంత్‌ మాన్.. ఎంపీగా కూడా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Read Also: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ.. ఉగాది వరకు డెడ్‌లైన్‌..!

Exit mobile version