NTV Telugu Site icon

Arvind Kejriwal: నా భార్య ‘‘ఝాన్సీ రాణి’’.. సునీతా కేజ్రీవాల్‌ని ప్రమోట్ చేస్తున్న ఆప్ చీఫ్..

Sunita Kejriwal

Sunita Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన భార్యను ప్రమోట్ చేసే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరుకున్న కేజ్రీవాల్‌ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది, దాదాపుగా 50 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, బెయిల్‌పై వచ్చిన ఆయన ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాను జైలుకు వెళ్లకూడదంటే తనకు ఓటేయాలని ప్రజల్ని కోరుతున్నారు. అదే విధంగా “అచ్ఛే దిన్ ఆనే వాలే హై, మోడీ జీ జానే వాలే హై” అంటూ నినాదాలు చేస్తున్నారు.

Read Also: Prostitution racket: స్కూల్ గర్ల్స్‌ని వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్.. స్నేహితురాలి తల్లే ప్రధాన సూత్రధారి..

ఇదిలా ఉంటే మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉండటంతో తన భార్య సునీతా కేజ్రీవాల్‌ని ప్రమోట్ చేసే ఉద్దేశం కనిపిస్తోందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన భార్య సునీతా కేజ్రీవాల్‌ని ప్రశంసించారు. ‘‘ఝాన్సీ కి రాణి’’ అంటూ అభివర్ణించారు. ‘‘ఈ రోజు నా భార్య వెంట ఉంది, నేను లేనప్పుడు ఆమె అన్నీ చూసుకుంది, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చేది. ఆమె ద్వారా నా ఢిల్లీ వాసుల యోగక్షేమాలు తెలుసునేవాడిని, ఆమె నా సందేశాలు తీసుకువచ్చేది. ఆమె ఝాన్సీకి రాణి లాంటిది’’ అంటూ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు.

మీ ఆశీర్వాదం వల్లే నా భర్త ఈ రోజు మాతో ఉన్నారు, మంచి పనిచేసేవారికి దేవుడు సాయం చేస్తాడని, నా భార్య జైలుకు వెళ్లకూడదనుకుంటే మే 25న ఆప్‌కి ఓటేయండి అంటూ ప్రజల్ని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని కేజ్రీవాల్ మరోసారి హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడదని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం కారణంగా దేశం మొత్తం బీజేపీపై కోపంతో ఉన్నారని చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకు జూన్ 25న ఆరో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.