Arvind Kejriwal Dinner At Auto Driver’s Home: గుజరాత్‌లో కేజ్రీవాల్ దూకుడు.. ఆటోడ్రైవర్ ఇంటికి ఆప్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీకే పరిమితం కాకుండా.. క్రమంగా రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్‌లో జెండా ఎగరవేసింది.. ఇప్పుడు గుజరాత్‌లో గెలుపే లక్ష్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో వరుసగా సమావేశం అవుతున్నారు. విద్యావంతులు, ఆటోడ్రైవర్లు, కర్షకులతో… ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే… మరోవైపు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో భేటీ అయ్యారు.
Read Also: Smriti Irani: రాహుల్‌ని టార్గెట్ చేసిన స్మృతి ఇరానీ.. వీడియోతో కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..
Also Read
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
అయితే, మీకు పెద్ద అభిమానినంటూ కేజ్రీవాల్‌కు చెప్పారు ఆటోడ్రైవర్ విక్రమ్ దంతానీ. పంజాబ్‌లో ఆటోడ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లినట్లే… తన ఇంటికి కూడా రావాలంటూ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. పంజాబ్‌లో చేసినట్లే గుజరాత్‌లోనూ చేస్తారా ? అని అడిగారు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన కేజ్రీవాల్… తనతో పాటు మరో ఇద్దరు వస్తారని తెలిపారు. స్వయంగా వచ్చి ఆటోలో తీసుకెళ్లాలని ఆటోవాలాను కోరారు.
ఇక, విక్రమ్ దంతానీ ఇంటికి ఆటోలో బయల్దేరిన కేజ్రీవాల్‌ను.. భద్రతా కారణాలతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ కలగజేసుకొని వారించడంతో చివరకు అనుమతించారు. ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్.. అతడితో కలిసి భోజనం చేశారు. భోజనంఎంతో రుచికరంగా ఉందన్న కేజ్రీవాల్… ఆటోవాలా కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. కేజ్రీవాల్ ఆటోలో విక్రమ్ దంతానీకి ఇంటికి వెళుతున్న వీడియోలు, డ్రైవర్ ఇంట్లో భోజనం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!