NTV Telugu Site icon

Kejriwal: కంగ్రాట్స్.. మీరే ఢిల్లీ సీఎం అభ్యర్థి! బీజేపీ నేతకు కేజ్రీవాల్ విషెస్

Exdelhicm

Exdelhicm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్‌‌గా దాడి చేస్తోంది. తాజాగా సీఎం అతిషిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిధురికి కంగ్రాట్స్‌ అంటూ వ్యాఖ్యానించారు. కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అందుకే ముందుగా మీకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు తెలిపారు. తమ దగ్గర పక్కా సమాచారం ఉందని.. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi Assembly Elections: బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి మీరే.. ఎంపీగా ఉండి ఢిల్లీకి ఏం చేశారో కాస్త చెప్పాలని రమేష్ బిధురిని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎంత? ఎంపీగా ఉన్నంత కాలం ఢిల్లీకి ఏం చేశారు.. మీ విజన్ ఏంటో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ రమేష్‌ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.

రమేష్ బిధూరి సీనియర్ రాజకీయ నాయకుడు. తుగ్లకాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీటు లభించలేదు. ప్రస్తుతం సీఎం అతిషి పోటీ చేస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచి రమేష్ బిధూరి బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున అల్కా లంబా పోటీలో ఉన్నారు.

ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: Jio Free YouTube Premium Subscription: జియో యూజర్స్‌కు పండగే.. రెండేళ్ల వరకు ఆ సేవలు ఫ్రీ!

Show comments