Arvind Kejriwal: ‘‘మోడీ, అమిత్ షా నాపై కుట్ర చేశారు’’.. కేజ్రీవాల్ ఆరోపణలు..

  • నాపై మోడీ, అమిత్ షా కుట్ర..
  • ఆప్‌ను అంతం చేయాలని జైలుకు పంపారు..
  • ఈడీ, సీబీఐలపై ప్రజలకు నమ్మకంపోయింది..
  • సంచలన ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్..
Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ ఎవెన్యూ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ పెట్టిన కేసులో ఎలాంటి మెరిట్ లేదని తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పు తర్వాత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్ర చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ నిజయితీపరుడని ప్రజలు నమ్మారని చెప్పారు. తమపై పెట్టిన కేసులు ఫేక్ అని కోర్టు తీర్పు చెప్పిందని అన్నారు. ఎప్పటికైనా గెలిచేది సత్యమే అని అన్నారు.

Read Also: Ayesha Meera case: ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సీబీఐ

సీబీఐ, ఈడీ తనను 4 ఏళ్లు వేధించాయని, ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని, తాను రూ. 100 కోట్లు లంచం తీసుకున్నానని, జైలు నుంచి విడుదలైన తర్వాత పారిపోయాడని అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. నాపై ఎందుకు ఆరోపణలు చేశారు, ఎవరు చేశారు? అని ప్రశ్నించారు. తాను పేరును మాత్రమే సంపాదించానని, డబ్బు సంపాదించలేదని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. ప్రజలు సోమ్ము ఒక్క రూపాయిని కూడా తాను వృథా చేయలేని రుజువైందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ పాలనలో ఢిల్లీ అన్ని రంగాల్లో వెనకబడిందని విమర్శించారు. సీబీఐ, ఈడీలపై దేశ ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. నిజాయితీగా వ్యవహరించిన న్యాయమూర్తికి, తన కోసం వాదించిన లీగల్ టీమ్‌కు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.