NTV Telugu Site icon

Swati Maliwal Row: స్వాతి మలివాల్‌పై దాడి విషయంలో కేజ్రీవాల్ మౌనం.. సంజయ్ సింగ్ సమాధానం..

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal Row: స్వాలి మలివాల్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని కుదిపేస్తోంది. వారం ప్రారంభంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో రాజ్యసభ ఎంపీ, మాజీ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయిన మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. అయితే, సహాయం కోసం ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూంకి రెండుసార్లు స్వాలిమలివాల్‌గా చెప్పబడే మహిళ ఫోన్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్వాతి మలివాల్ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఆమెతో సెటిల్‌మెంట్ కోసం ఆప్ ప్రయత్నిస్తుందనే వాదన వినిపిస్తోంది. బుధవారం ఆమె నివాసానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెళ్లడం చర్చనీయాంశం అయింది.

Read Also: Sunil Chhetri: భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి..

ఇదిలా ఉంటే, ఈ రోజు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కేజ్రీవాల్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో స్వాతి మలివాల్‌పై దాడి విషయాన్ని విలేకరులు ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ మౌనం వహించారు. దీంతో పక్కనే ఉన్న ఎంపీ సంజయ్ సింగ్ దీనికి కౌంటర్ ఇచ్చారు. మణిపూర్‌లో గిరిజన మహిళను నగ్నంగా ఉరేగించారు, బీజేపీ మిత్రపక్షానికి చెందిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల గురించి సంజయ్ సింగ్ తిరిగి ప్రవ్నించారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు న్యాయం కోసం పోరాడుతుంటే, అప్పటి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్, వారికి మద్దతుగా వెళ్లి, పోలీసులచే లాగబడి కొట్టబడ్డారని సంజయ్ సింగ్ అన్నారు. మహిళలపై నేరాలకు ఆ పార్టీ(బీజేపీ) మౌనానికి ఉదాహరణ అని వ్యా్ఖ్యానించారు.

‘‘ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కుటుంబం. పార్టీ తన వైఖరని స్పష్టం చేసింది. నేను లేవనెత్తిన అన్ని సమస్యలపై ప్రధాని, బీజేపీ స్పందించాలని కోరుకుంటున్నాను. దయచేసి దీనిపై రాజకీయ ఆటలు ఆడొద్దు’’ అని సంజయ్ సింగ్ కోరారు. అయితే, బీజేపీ ఈ అంశంలో ఆప్‌పై విరుచుకుపడుతోంది. కేజ్రీవాల్ తన పీఏ బిభవ్ కుమార్‌ని రక్షిస్తున్నారని ఆరోపించింది. స్వాలి మలివాల్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ ప్రశ్నించింది. బుధవారం బీజేపీ మహిళా మోర్చా సీఎం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన వ్యక్తం చేసింది. స్వాతి మలివాల్‌పై దాడి జరిగిందనే విషయాన్ని ఆప్ పార్టీ ఒప్పుకుంది. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది.