AAP: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈ సారి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. బీజేపీ 50, ఆప్ 19, కాంగ్రెస్ 01 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
READ ALSO: Congress: దశాబ్ధాల చరిత్ర ఉన్నా.. దేశ రాజధానిలో పత్తాలేని కాంగ్రెస్..
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆప్ దిగ్గజ నేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి వెనకంజలో ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ కీలక నేత పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. కేజ్రీవాల్ సహా ప్రస్తుత సీఎంగా ఉన్న అతిశీ మార్లెనా కల్కాజీ నియోజకవర్గం నుంచి వెనకంజలో ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి గెలుపు దిశగా పయణిస్తున్నారు. ఇక మరో కీలక నేత మనీష్ సిసోడియా జంగ్‌పురా నుంచి వెనకంజలో కొనసాగుతున్నారు. ఈ స్థానంలో కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తర్వీందర్ సింగ్ ముందంజలో ఉన్నారు.
ఢిల్లీలో ఆప్ విశ్వసనీయతను దెబ్బతీసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల ఇద్దరూ కూడా వెనకంజలో ఉండటం గమనార్హం. అవినీతి రహిత పాలన అందిస్తామనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చిన ఆప్, ఈ స్కామ్‌లో ఇరుక్కోవడంతో ఆ పార్టీపై ఢిల్లీ ఓటర్లకు ఉన్న నమ్మకాన్ని వమ్ముచేసింది.