Site icon NTV Telugu

Arvind Kejriwal: మార్పు మొదలు పెట్టాం.. పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారు..

దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మరో రాష్ట్రం అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది… 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది… మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌, ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్‌ సిద్ధూ.. ఇలా అంతా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇక, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్…

పెద్ద పెద్ద నాయకులంతా దేశ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించిన కేజ్రీవాల్.. పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారని.. పంజాబ్‌లో ఇది పెద్ద విప్లవంగా అభివర్ణించారు.. చన్నీ, సిద్ధూ, లాంటి పెద్ద నేతలందరినీ పంజాబ్ ప్రజలు ఓడించారని గుర్తుచేసిన ఆయన.. భగత్ సింగ్ ఆనాడే చెప్పాడు.. ఆంగ్లేయులను ఇండియా నుంచి పంపారూ.. కానీ, అప్పటి విధానాలను మార్చలేదని.. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మార్పు మొదలు పెట్టిందని వెల్లడించారు. ఇక, కేజ్రీవాల్‌ను టెర్రరిస్ట్ అన్నారు… కేజ్రీవాల్ టెర్రరిస్ట్ కాదని దేశ ప్రజలు స్పష్టం చేశారు.. దేశ భక్తుడని తీర్పు ఇచ్చారని తెలిపారు.. ఇప్పటికి వైద్య చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాలా..? ఇక్కడే చదివేలా ఏర్పాట్లు చేయలేమా..? అని ప్రశ్నించారు కేజ్రీవాల్..

Exit mobile version