Site icon NTV Telugu

West Bengal: ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్..

Isis Terrorists

Isis Terrorists

Arrest of two terrorists associated with ISIS: నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమబెంగాల్ హౌరాలో అరెస్ట్ చేశారు. కోల్‌కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి ఐసిస్ తో సంబంధం ఉన్న ఎండీ సద్దాం (28), సయీద్ (30)లను శుక్రవారం అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు వీరిని జనవరి 19 వరకు పోలీస్ కస్టడీకి పంపింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, సీపీయూ, నోట్‌బుక్‌లు, డైరీ, ఆయుధాలు, డెబిట్ కార్డులు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Team India: ఇషాన్ కిషాన్ ఇదేం ప్రదర్శనా? ఒక్క మ్యాచ్ ఆడితే చాలా?

స్వాధీనం చేసుకున్న పత్రాలలో జిహాదీ కంటెంట్, జిహాదీ ఛానెల్‌ల జాబితాను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్టీఎఫ్ టీం శుక్రవారం రాత్రి హౌరా జిల్లాలో దాడులు నిర్వహించి, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సయ్యద్ ను అరెస్ట్ చేసింది. సద్దాం పోలీసులకు వాగ్మూలం ఇవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినందుకు వారిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టి ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. దీంతో పాటు ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. వీరిద్దరి మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను సేకరించడంతో పాటు తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడంలో కూడా పాలుపంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. హౌరాలో అఫ్తాబుద్దీన్ మున్షీ లేన్ లో నివాసం ఉంటున్న సదమ్ ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని శనివారం కోల్ కతా లోని బ్యాంక్ షాల్ కోర్టులో హాజరు పరచగా.. జనవరి 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు.

Exit mobile version