NTV Telugu Site icon

న‌న్నూ అరెస్ట్ చేయండి.. రాహుల్ ఫైర్

Rahul Gandhi

న‌న్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేంద్రానికి స‌వాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. క‌రోనా నివారణ చ‌ర్య‌ల్లో మోడీ స‌ర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్ట‌డం, అరెస్టులు చేయ‌డంపై ట్విట్ట‌ర్‌లో స్పందించిన రాహుల్.. ఆ పోస్టర్ల కాపీలను షేర్ చేస్తూ. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ కామెంట్ పెట్టారు.. ఇక‌, మోడీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు? అనే నినాదాలు రాసుకొచ్చారు.. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ హిందీలో ట్వీట్ చేశారు… కాగా, పోస్టుర్లు వేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై శ‌నివారం రోజు ఢిల్లీ పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. చాలా మందిని అరెస్ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.. పోలీసులకు గురువారం పోస్టర్ల గురించి సమాచారం అంద‌గా.. ఫిర్యాదుల ఆధారంగా, వారు భారతీయ శిక్షాస్మృతి మరియు ఇతర సంబంధిత విభాగాల సెక్షన్లు 188 కింద 25 ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.