Site icon NTV Telugu

Tejashwi Yadav: నీట్‌పై కౌంటర్.. ఆధారాలుంటే అరెస్ట్ చేయండి

Tejavi

Tejavi

నీట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. పలువురిని అరెస్ట్ చేసింది. ఇక ఈ వ్యవహారంపై బీహార్‌లో కాకరేపుతోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై చేస్తోన్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

ఇది కూడా చదవండి: High blood pressure: అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్నారా.? చాలా ప్రమాదం..

శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ఒక ఇంజిన్‌ అవినీతిని, మరో ఇంజిన్‌ నేరాలను ప్రమోట్‌ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేపర్‌ లీకైనా, వంతెనలు కూలినా, హత్యలు జరిగినా.. రాష్ట్రంలో ప్రతి సమస్య తేజస్వీ వల్లేనంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దగ్గర ఆధారం ఉంటే ఆరోపణలు మాని అరెస్టు చేసుకోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా

నీట్‌- యూజీ ప్రవేశపరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్‌ లీక్‌ వెనక తేజస్వీ యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందంటూ బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ ఇటీవల ఆరోపించడంపై ఆర్జేడీ కౌంటర్‌ ఇచ్చింది. బీహార్‌లోని సీనియర్‌ మంత్రులతో ఇతర కీలక అనుమానితులు ఉన్న ఫొటోలను ఆర్జేడీ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: SIT: హత్రాస్ ప్రమాదంపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణాలు ఇవే..

Exit mobile version