Site icon NTV Telugu

Bank SMS Fraud: ఫేక్ మేసేజ్‌ల వల.. 3 రోజుల్లోనే 40 మంది కస్టమర్ల నగదు గోవింద

Bank Fraud

Bank Fraud

Bank SMS Fraud:‘‘డియర్ కస్టమర్.. ఈరోజు మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతోంది.. డియాక్టవేట్ కాకుండా ఉండేందకు ఇప్పుడే మీ కేవీసీ, పాన్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి’’ అంటూ మేసేజ్ వస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారంతే అంతే సంగతులు. మోసగాళ్లు మీ ఖాతాలోని నగదును కొట్టేస్తారు. ఇలాంటి మేసేజులు వస్తే క్లిక్ చేయొద్దు. ఇలాంటి మెసేజులను చదివి నిజమే అనుకుని ముంబైలో ఓ బ్యాంకుకు చెందిన 40 మంది కష్టమర్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు. లక్షల డబ్బు మోసగాళ్లకు చేరిపోయింది.

Read Also: Brutally Beaten : ప్రియురాలు పిలిచింది.. కట్ చేస్తే ప్రాణాలు ఫట్

ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంకు చెందిన 40 మంది కస్టమర్లు నకిలీ బ్యాంక్ ఎస్ఎంఎస్ ద్వారా పంపిన లింక్ పై క్లిక్ చేసిన తర్వాత కేవలం 3 రోజుల్లోనే లక్షల డబ్బును పోగొట్టుకున్నారు. ముందుగా వారికి కేవైసీ, పాన్ అప్డేట్ చేయమని మెసేజ్ వస్తుంది, అయితే దీన్ని అధికారిక మెసేజ్ అని భావించిన పలువరు కస్టమర్లు డబ్బును పోగొట్టుకున్నారు. ఈ ఫిషింగ్ బ్యాంక్ ఎస్ఎంఎస్ బాధితుల్లో టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఆమె లింక్ పై క్లిక్ చేసి తర్వాత రూ. 50,000 కంటే ఎక్కువగా మోసపోయింది. కేవైసీ, పాన్ వివరాలను అప్ డేట్ చేయమని కోరుతూ వచ్చినట్లు తన ఫిర్యాదులో తెలిపింది. బ్యాంకు తన ఖాతాను నిలిపివేయడాన్ని ఆపడానికి ఆమె ఈ పని చేసింది.

ఆ లింక్ ఆమెను వెబ్ సైట్ లోకి తీసుకెళ్లింది. ఆమె తన కస్టమర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీని నమోదు చేయమని కోరారు, బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకున్న మహిళ, మీనన్ సెల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలని కోరింది, ఈ మేరు మీనన్ ఓటిపి నమోదు చేయగానే ఆమె ఖాతా నుంచి రూ.57,636 డెబిట్ అయ్యాయి. ఇది గమనించిన శ్వేతా మీనన్ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులు ఇలాంటి మేసేజు లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.

Exit mobile version