Site icon NTV Telugu

AR Rahman : గ్రామీ విజేతకు గ్రాండ్ వెల్‌కమ్.. రెహమాన్ స్టన్నింగ్ కామెంట్స్..!

Rahman

Rahman

AR Rahman : సంగీత మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల కర్ణాటకలోని సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యూమానిటేరియన్, ఆధ్యాత్మిక నేత మధుసూదన్ సాయి నేతృత్వంలోని ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’ నిర్వహిస్తున్న మానవతా కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులు ప్రదర్శించిన ‘సాయి సింఫనీ ఆర్కెస్ట్రా’ కార్యక్రమం రెహమాన్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పేద గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులతో 2014లో స్థాపించబడిన ఈ స్వదేశీ ఆర్కెస్ట్రా దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందుతోంది. ప్రఖ్యాత సంగీతాలు — మిషన్ ఇంపాజిబుల్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్.. లాంటి మెలోడీలను విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. గ్రీకు-అమెరికన్ మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ డిమిట్రిస్ లాంబ్రియానోస్ వీరికి శిక్షణ ఇచ్చారు.

Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు

ఈ ప్రదర్శనపై స్పందించిన రెహమాన్, ఇది తాను చూసిన అత్యద్భుతమైన ప్రదర్శనల్లో ఒకటిగా కొనియాడారు. విద్యార్థుల ప్రతిభపై మెచ్చుకున్న ఆయన, భవిష్యత్తులో వీరంతా దేశం తరఫున అత్యుత్తమ సింఫనీగా ఎదిగే అవకాశం ఉందన్నారు. అరుదైన వాద్య పరికరాలతో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌ను రెహమాన్ ప్రశంసించారు.

ఈ సందర్భంగా మధుసూదన్ సాయి మాట్లాడుతూ, రెహమాన్ తన ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సంగీతాన్ని అందించడమే కాదు, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు థీమ్ సాంగ్ కంపోజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటళ్లలో రోగులకు హీలింగ్ మ్యూజిక్ అందించేందుకు రెహమాన్ ముందుకొచ్చినట్లు వెల్లడించారు.

Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

Exit mobile version