AR Rahman : సంగీత మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల కర్ణాటకలోని సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యూమానిటేరియన్, ఆధ్యాత్మిక నేత మధుసూదన్ సాయి నేతృత్వంలోని ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’ నిర్వహిస్తున్న మానవతా కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులు ప్రదర్శించిన ‘సాయి సింఫనీ ఆర్కెస్ట్రా’ కార్యక్రమం రెహమాన్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పేద గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులతో 2014లో స్థాపించబడిన…