NTV Telugu Site icon

Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..

Apple

Apple

Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నివేదికల ప్రకారం..జీతాల మోసానికి పాల్పడ్డారు. తమ పరిహారాన్ని పెంచుకోవడానికి మెసానికి పాల్పడ్డారని గుర్తించారు. దీంతో యాపిల్ దీనితో సంబంధం ఉన్న ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగుల్లో బే ఏరియాలోని అధికారులు ఆరుగురిని గుర్తించారు. వారిపై అరెస్ట్ వారెంట్ల్ జారీ చేయబడ్డాయి. అయితే, ఆరుగురిలో ఎవరూ భారతీయులు లేరు. కానీ తొలగించబడిని ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వ్యక్తులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Read Also: Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..

అమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై యాపిల్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. లాస్ ఏంజిల్స్‌లోని జిల్లా న్యాయవాది కార్యాలయం రిపోర్టుల ప్రకారం.. యాపిల్ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌ని దుర్వినియోగం చేసిన కారణంగా బే ఏరియా ఆఫీసు నుంచి అనేక మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.

ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు, లాభాపేక్ష లేని సంస్థలకు సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఉద్యోగులు ఏ సంస్థకైతే విరాళం ఇస్తారో, ఆ సంస్థకు మ్యాచింగ్ గ్రాంట్ కలిపి యాపిల్ విరాళం ఇస్తుంది. ఇదే ఉద్యోగులకు వరంగా మారింది. సదరు సంస్థలు తిరిగి ఈ విరాళాలను సేవ కోసం ఉపయోగించకుండా ఉద్యోగులకు రిటర్న్ చేసినట్లు తేలింది. యూఎస్ కంపెనీల టాక్స్ లెక్కలను చూసే ఇంటర్నల్ రెవన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఉద్యోగుల మోసాన్ని కనిపెట్టింది.

Show comments