APP on ED notice to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఈరోజు నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మోదీని ప్రశ్నిస్తున్నందుకే సీఎం కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. మరోవైపు మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గపడ్డాయని తెలంగాణ మంత్రులు దుయ్యబడుతున్నారు.
Read Also: Tragedy : కేరళలో విషాదం.. తెల్లారే సరికి దూలానికి తండ్రి, బకెట్లో కొడుకు శవాలు
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ స్పందించారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు నోటీసులు ఇవ్వడం విఫయాలను వేధించాలనే ఉద్దేశంతో కూడినవే అని ఆయన అన్నారు. మహిళా హక్కుల కోసం ఢిల్లీలో మార్చి 10న దీక్ష చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈడీ ఈ రోజు నోటిసులు ఇచ్చిందని అన్నారు. విపక్షాలను రూపుమాపేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును తెచ్చుకోండంటూ బీజేపీని విమర్శించారు. ఈడీ, సీబీఐకి బడ్జెట్ నిధులను పెంచండి, గల్లీగల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాలను కూడా విచారించే నియమాలను కూడా తీసుకురండి, విద్య, వైద్యం, కరెంట్, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ బీజేపీ ప్రభుత్వానికి అవసరం లేదని దుయ్యబట్టారు.
