పంజాబ్ రాష్ట్రానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్‌లో జరిగే ఎన్నికలపై ఆప్ పార్టీ దృష్టిసారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఛండీగడ్‌లో పర్యటించారు. పార్టీ నాయకులతో చర్చించారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని ముందుగా ప్రకటించారు.
Read: 60 ఏళ్ళ ‘బాటసారి’
అయితే, నిన్నటి రోజున కేజ్రీవాల్ సడెన్ సప్రైజ్ ఇస్తూ, 200 యూనిట్లు కాదు 300 వరకు కరెంట్ ఫ్రీగా అందిస్తామని తెలిపి షాక్ ఇచ్చారు. ఈ పథకం అమలతో 77 నుంచి 80 శాతం మందికి విద్యుత్ బిల్లుల బెడద ఉండదని కేజ్రీవాల్ పేర్కోన్నారు. ఇవి బడాయి మాటలు కాదని, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, కేవలం మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారని కేజ్రీవాల్ పేర్కోన్నారు.
