ప్రస్తుతం దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు ప్రైవేట్ సంస్థలు కూడా వాక్సినేషన్ డ్రైవ్ కు ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా అపోలో హాస్పిటల్స్ జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశంలోని 50నగరాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 200కి పైగా అపోలో వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా డ్రైవ్ నిర్వహిస్తామని అపోలో హెల్త్‌కేర్ ప్రకటన చేసింది. అన్ని టీకా కేంద్రాలలో బౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 10వేల మందికి పైగా సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు అపోలో తెలిపింది.