Site icon NTV Telugu

BJP MP Controversy: ఈ బీజేపీ ఎంపీ బెల్టు ధర జస్ట్ లక్షే.. అందుకే పార్లమెంట్లో కవర్ చేశాడు..?

Anurag

Anurag

BJP MP Controversy: సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్ల వస్తువులను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్తునే.. మరోవైపు విదేశీ లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తుండటం తరచూ విమర్శలకు దారి తీస్తుంది. తాజాగా ఇదే ఇష్యూపై బీజేపీ కీలక నేత, ఎంపీ అనురాగ్ ఠాకూర్ నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అందుకు కారణం ఆయన ధరించిన ఓ ఖరీదైన లూయిస్ విట్టన్ (Louis Vuitton) బెల్టు.

Read Also: Ajit Pawar: వెలుగులోకి అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్ సంభాషణ.. మరణానికి ముందు ఏం మాట్లాడారంటే..!

అయితే, ప్రస్తుతం పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో అమిత్ షాకు మద్దతుగా వెనక వరుసలో కూర్చున్న ఎంపీలు, మంత్రులు ఒక్కసారిగా పైకి లేచారు. వారిలో అనురాగ్ ఠాకూర్ కూడా పైకి లేచి ఏదో చెప్పబోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

ఇక, ఆ వీడియోలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధరించిన లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ బెల్టు నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. బెల్ట్ స్పష్టంగా కనిపించకుండా ఆయన బ్లేజర్‌తో కవర్ చేసేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించడంతో విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకవైపు స్వదేశీ వస్తువుల వాడాలని ఉపన్యాసాలు ఇస్తూ.. మరోవైపు లక్షల విలువైన విదేశీ బ్రాండ్లు ఉపయోగిస్తున్నారు.. ఇదే బీజేపీ నేతల నిజ స్వరూపం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొందరు, పాలసీలను సమర్థించుకోవడం కంటే డిజైనర్ బెల్టులను దాచుకోవడానికే రాజకీయ నాయకులు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారని విమర్శించారు. మొత్తం వ్యవస్థ పరిస్థితికి ఈ వీడియోనే నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధరించిన లూయిస్ విట్టన్ బెల్ట్ ధర రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ నేతలు ఖరీదైన లగ్జరీ బ్రాండ్లు వినియోగిస్తూ, సామాన్య ప్రజలకు మాత్రం నీతులు చెబుతున్నారనే భావన నెటిజన్లలో పెరిగిపోతుంది. ముందు నాయకులే మారాలి, ఆ తర్వాతే ప్రజలకు ఉపదేశాలు ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version