జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి ఒకరు మరణించారు. మృతి చెందిన అధికారి కుల్దీప్‌గా గుర్తించారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సిఆర్‌పిఎఫ్ జవాన్లు పెట్రోలింగ్ చేస్తుండగా డుడు ప్రాంతంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. దీంతో.. భద్రతా బలగాలు వారికి ధీటుగా కాల్పుల మోత మోగించారు.
Read Also: Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
ఉదంపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్, ఎస్వోజీ, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారని ఆర్మీ అధికారి తెలిపారు. ఈ క్రమంలో.. ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్డన్‌ను ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
