NTV Telugu Site icon

BJP: “బెంగాల్‌లో మరో తాలిబాన్ వీడియో”.. తృణమూల్ అరాచకాలపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?

Bengal

Bengal

BJP: పశ్చిమ బెంగాల్‌లో అరాచక పాలన కొనసాగుతోందని మరోసారి బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఒక వీడియోలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే సన్నిహితుడు తన గ్యాంగ్‌తో కలిసి ఒక అమ్మాయిని కొడుతున్నట్లుగా చూపిస్తోంది. ఈ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్‌‌లో ట్వీట్ చేశారు. ‘‘చోప్రా తాలిబానీ కొరడా దెబ్బల తర్వాత బెంగాల్ నుంచి మరో భయంకరమైన తాలిబానీ వీడియో’’ అని ఆయన ఆరోపించారు.

తృణమూల్ కాంగ్రెస్ నాయకుడితో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి మహిళను దారుణంగా కొడుతున్నట్లు చూపిస్తోందని పూనావాలా అన్నారు. ఇలాంటి ఘటనలు బెంగాల్‌లో నిరంతరం జరుగుతూనే ఉన్నాయని, టీఎంసీ అంటే తాలిబానీ ముజే చాహియే అని అర్థం అని విమర్శించారు. టీఎంసీ చోప్రా, సందేశ్‌ఖాలీ సంఘటనలను కూడా సమర్థించారని, మమతా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టిందని ఆయన అన్నారు.

Read Also: Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ సమస్యలపై ఫోకస్‌ పెట్టిన కేంద్రం.. రేపు విశాఖకు ఉక్కు మంత్రి..

దోషులను రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘ఈ రోజు, మమత ప్రభుత్వం తన నినాదాన్ని ‘మా మతి మనుష్’ నుండి ‘బాలాత్కారీ బచావో’ (రేపిస్టులను రక్షించండి), ‘భ్రష్టచారి బచావో’ (అవినీతిపరులను రక్షించండి) మరియు ‘బాంబ్ బ్లాస్ట్ కర్నే వాలో కో బచావో’ (బాంబర్లను రక్షించండి)’’గా మార్చారని అన్నారు.

ఇదిలా ఉంటే ఈ విషయంపై ఇండియా కూటమి మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నించింది. మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు, మణిపూర్ గురించి మాట్లాడే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ బెంగాల్‌లో జరిగే సంఘటనపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారా..? అంటూ షెహజాద్ పూనావాలా నిలదీశారు.