Site icon NTV Telugu

Karnataka: కర్నాటక సర్కార్ సంచలనం నిర్ణయం … వచ్చే ఏడాది నుంచి జాతీయ విద్యావిధానం రద్దు

Karnataka

Karnataka

Karnataka: కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని మంగళవారం జరిగిన కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు నిలిపేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో బీజేపీ తమ రాష్ట్రాల్లో అమలు చేయని జాతీయ విద్యావిధానాన్ని కర్ణాటకలో మాత్రమే అమలు చేసిందని సిద్దరామయ్య గుర్తు చేశారు. మనువాద భావజాలంతో కూడిన ఈ విద్యావిధానం కంటే రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో విద్యావిధానం అమలువుతుందని సిద్ధరామయ్య వెల్లడించారు. గతంలో బీజేపీ అధికారంలో ఉండగా.. మనువాద భావజాలంతో తీసుకున్న పలు నిర్ణయాలను సిద్ధరామయ్య సర్కార్‌ సమీక్షిస్తోంది. విద్యావిధానంలోనూ జరిగిన కాషాయీకరణను సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలును నిలివేయాలని నిర్ణయించింది.

Read also: Priya Vadllamani: అక్కడ ఆ మచ్చ అదిరింది ప్రియా.. కిర్రాక్ పో

ఈ ఏడాది రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో ఎన్నికలు జరిగి ఫలితాలు రావడంతో ఈ నిర్ణయం అమలు చేయడం సాధ్యం కాదని సిద్ధరామయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జాతీయ విద్యావిధానం అమలు రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని సిద్ధరామయ్య ప్రకటించారు. ఎన్‌ఈపీ-2020ని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రవేశపెట్టకుండా కర్ణాటకలోనే అమలు చేశారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం అయిందని.. అందుకే వచ్చే ఏడాది నుండి తాము ఎన్ఈపీని మారుస్తామని సిద్దరామయ్య తెలిపారు. రాజ్యాంగానికి అనుగుణంగా విద్యను అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. బీజేపీ వారు మనువాదాన్ని నమ్ముతారని సిద్ధరామయ్య అన్నారు. అవసరమైన సన్నాహాలు చేసిన తర్వాత ఎన్‌ఇపిని రద్దు చేయాలని భావిస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఎన్‌ఇపిని విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని చెప్పిన సిద్ధ రామయ్య.. ఇతర రాష్ట్రాలు అమలు చేయకముందే కర్ణాటకలో ఎన్‌ఇపిని అమలు చేయడం ద్వారా బీజేపీ విద్యార్థులకు నష్టం చేసిందన్నారు.

Exit mobile version