Site icon NTV Telugu

Train Accident: జార్ఖండ్‌ రైలు ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి.. రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా

Trin Accident

Trin Accident

జార్ఖండ్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో హౌరా- ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అయితే.. అదే ట్రాక్ పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వహించారు. ఈ ప్రమాదంలో.. మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని రైల్వేశాఖ ప్రకటించింది.

Read Also: Telegram CEO: పెళ్లి కాలేదు కానీ, 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు.. టెలిగ్రామ్ సీఈవో సంచలన ప్రకటన

దేశ వ్యాప్తంగా ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా దాని కప్లింగ్ లింక్ తెగిపోయింది. కొద్దిసేపటికే రైలులోని రెండు కోచ్‌లు విడిపోయాయి. రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే, రైలు కోచ్‌లు విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు సీల్దా-అగర్తలా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. 11 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

Read Also: Beggar: యాచకుడి జేబులో రూ.5 లక్షలు.. మ్యాటరేంటంటే.?

Exit mobile version