NTV Telugu Site icon

Annamalai: విజయ్-త్రిష ఎయిర్‌పోర్ట్ విజువల్స్ లీక్.. దీని వెనక డీఎంకే ప్రభుత్వ ప్రమేయం..

Annamalai

Annamalai

Annamalai: చెన్నై ఎయిర్‌పోర్టులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిష ఫోటోల వెనక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉందని, ఫోటోలను తీసి డీఎంకే ఐటీ టీమ్‌కి ఇచ్చిందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై ఆరోపించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విజయ్-త్రిషలు ప్రైవేట్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో వారి వీడియోను తీశారని అన్నామలై అన్నారు.

ఇటీవల, విజయ్, త్రిషలు నటి కీర్తి సురేష్ వివాహం కోసం గోవాకు ప్రైవేట్ విమానంలో కలిసి ప్రయాణించిన వీడియోలు మరియు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. నటీనటుల ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి..? అని ప్రశ్నించారు. ‘‘విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. గత వారం గోవాలో ఓ పెళ్లికి వెళ్లారు. అతను గేట్ నెం. 6 నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరారు. అతని ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వస్తాయి..?’’ అని అన్నామలై ప్రశ్నించారు.

Read Also: Udhayanidhi Stalin: నేను ‘‘ క్రైస్తవుడిగా గర్విస్తున్నా’’..

విజయ్ పెళ్లికి ఎవరితోనైనా వెళ్లొచ్చు. అది అతడి వ్యక్తిగత విషయం. అయితే, ఆ ఫోటోలను ఎవరు విడుదల చేశారు..? ఈ ఫోటోలనున తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సోషల్ మీడియా సెల్‌కి ఎవరు అందించారు అని అడిగారు. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రికి లేఖ రాస్తానని అన్నామలై చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వీలుగా ఈ ఫోటోలను ఎవరు తీశారో మంత్రిత్వ శాఖ కనిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎవరి బయలకు వెళ్లినా ఫోటోలు తీసి, డీఎంకేకి ఇవ్వడం ఇంటలిజెన్స్ పనా..? అని ప్రశ్నించారు. వేరొకరి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు లేదని డీఎంకేపై విరుచుకపడ్డారు. ‘‘ మీ డీఎంకే రాజకీయ సంస్కృతి ఇదేనా.. డీఎంకే ప్రజలు ఇలానే గౌరవిస్తుందా..? ప్రజలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళతారు. ఈ సందర్భంలో వారు ఒక వివాహానికి వెళ్లారు. కానీ మీరు ఆ ఫోటోలను కూడా తీస్తారు, లీక్ చేస్తారు. మీరు ప్రయాణికుల మానిఫెస్టోని కూడా బయటకు తెస్తారు’’ అని డీఎంకేపై ధ్వజమెత్తారు.