Ankita Bhandari Murder Case: 2022లో రాజకీయంగా సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసులో ఈ రోజు తీర్పు వెలువడనుంది. పౌరి జిల్లా యమకేశ్వర్‌లో ఉన్న వనాంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకిత హత్యకు గురికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. ఈ రిసార్ట్ బీజేపీ నేత కుమారుడి కావడంతో ఈ కేసు జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది. ఈ హత్యలో బీజేపీ నేత వినోదర్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. 19 ఏళ్ల అంకితా భండారీ మరణం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో పుల్కిత్‌తో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను సహ నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులపై ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ అదనపు జిల్లా మరియు సెషన్ జడ్జి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. సెప్టెంబర్ 18, 2022న నిందితులు ముగ్గురు అంకితను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉండే కాలువ నుంచి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అంకితా భండారీ నీటిలో మునిగి ఉపిరాడక చనిపోయారాని నివేదిక వెల్లడించింది. మరణానికి ముందు ఆమె శరీరంపై గాయాలను కనుక్కున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించింది.
Read Also: Asim Munir: సింధు జలాలపై పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక.. “రెడ్ లైన్” అంటూ..
ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత, న్యాయమూర్తి మే 30న తీర్పును ప్రకటించబోతున్నారు. కేసు విచారణ రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు కొనసాగింది. ఈ సమయంలో, దర్యాప్తు అధికారులు 47 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ న్యాయవాది అనుజ్ పుండిర్ కోర్టుక సమర్పించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, అంకిత భండారీ, పుల్కిత్ ఆర్య మధ్య ఏదో వివాదం ఉందని, ఆ తర్వాత భాస్కర్, గుప్తాల సహాయంలో మహిళను రిషికేష్ లోని చీలా కాలువలో తోసేసినట్లు ఆరోపించారు.
ఈ కేసులో సీఎం సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. సిట్ ఏర్పాటు చేసి కేసును విచారించారు. ఈ హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తం ఉన్న రిసార్టులను తనిఖీ చేయాలని ఆదేశించారు. పుల్కిత్ ఆర్యకు సంబంధించిన రిసార్ట్ అక్రమ కట్టడంగా పేర్కొంటూ ప్రభుత్వం కూల్చేసింది. పుల్కిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.