నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. దేశ్‌ముఖ్ నార్ఖేడ్‌లో బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కటోల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్‌కు ప్రచారం చేసేందుకు నార్ఖేడ్ వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. తలకు గాయం కావడంతో రక్తం కారింది. బట్టలు కూడా రక్తపుమరకలయ్యాయి.
ఇది కూడా చదవండి: FIFA Friendly Match: ఇండియా vs మలేసియా ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా..
మహారాష్ట్రలో సోమవారం ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతలంతా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. సోమవారంతో ప్రచారమైతే ముగిసింది. ఇక పోలింగ్ మిగిలి ఉంది.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: నిందితుడు సంజయ్‌రాయ్ తరలింపులో పోలీసులు కొత్త ట్రిక్!
నవంబర్ 20న మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత బుధవారం జరగనుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవారం జరగనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈసారి ప్రజలు ఎవరికి పట్టంకడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
नागपुर के पास काटोल में NCP शरद पवार गुट के नेता अनिल देशमुख पर हुआ हमला#AnilDeshmukh | Anil Deshmukh | #Maharashtra pic.twitter.com/Fg16WRa66u
— News24 (@news24tvchannel) November 18, 2024