Anant Ambani: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ దేశాలకు చెందిన మాజీ ప్రధానులు, రాయబారులతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్లు ఈ వివాహానికి హాజరయ్యారు. జూలై 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగా వైభవంగా అనంత్-రాధికాల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రోజు ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకలు, రెండు రిసెప్షన్లు నిర్వహించారు.
ఇదిలా ఉంటే, అనంత్ అంబానీ రిసెప్షన్‌లో అంత మంది అతిథులు ఉండగా ఒక మమిళా పాదాలకు నమస్కరించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మైసూర్ కేఫ్ యజమాని శాంతేరి నాయక్‌ని, తన భార్య రాధిక మర్చంట్‌కి పరిచయం చేయడం చూడొచ్చు. ‘‘మైసూర్ కేఫ్ యజమానిని కలవండి’’ అంటూ పరిచయం చేశారు. రాధికా శాంతేరి నాయక్ దగ్గరకు వెళ్లి ఆమె చేతులు పట్టుకుని పలకరించారు. ‘‘ప్రతీ ఆదివారం, మేము మీ భోజనం మా ఇంట్లో తింటాము’’ అని రాధిక చెప్పడం వినొచ్చు. దీనికి ఆమె చాలా ధన్యవాదాలు అని చెప్పారు. ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా మరియు ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్ కూడా వీడియోలో శాంతేరి నాయక్‌ని పలకరించడం చూడొచ్చు.
మైసూర్ కేఫ్, మాతుంగా ప్రాంతంలోని ఉంది. ముంబైలోని పురాతన రెస్టారెంట్లలో ఒకటి. దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. ముఖేష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో మైసూర్ కేఫ్‌ని తరుచూ సందర్శించేవాడినని చెప్పారు.