Site icon NTV Telugu

Anand Sharma: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. కీలక పదవికి ఆనంద్ శర్మ రాజీనామా.

Congress Leader Anand Sharma

Congress Leader Anand Sharma

Anand Sharma quits Congress post: కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కీలక నేత అయిన ఆనంద్ శర్మ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ సీనియన్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీ కీలక పదవులకు రాజీనామా చేసి రోజులు గడవకముందే.. ఆనంద్ శర్మ రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ శర్మ ఉన్నారు. తాజాగా ఆదివారం ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు.

అయితే హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ జరిపిన సంప్రదింపుల్లో తనను విస్మరించారని ఆనంద్ శర్మ ఆరోపిస్తున్నారు. తన రాజీనామా లెటర్ ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు ఆనంద్ శర్మ. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత అయిన ఆనంద్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కీలక నాయకుల్లో ఈయన ఒకరు. పార్టీ సమావేశాలకు తనను సంప్రదించకపోవడం, ఆహ్వనించకపోవడంతో కొంత కాలంలో ఆయన పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోనియాగాంధీకి పంపిన లేఖలో ఆయన ప్రస్తావించారు.

Read Also: Jyothula Naveen: పార్టీ కోసమే పనిచేస్తున్నా… కమిట్మెంట్ తో వున్నా

ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ అధికారం చేపట్టాలని చూస్తోంది. అయితే ఎన్నికలకు మరికొన్ని నెలుల ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఆనంద్ శర్మ రాజీనామా కలకలం రేపుతోంది. 1982 లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆనంద్ శర్మ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ టికెట్టు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన వరసగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పలు కీలక పదవుల్లో పనిచేశారు.

Exit mobile version