Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..

  • ఒకే వ్యక్తి-ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో షాకింగ్ ట్విస్ట్..
  • ఫాలోవర్లను పెంచుకోవడానికే చేసినట్లు వెల్లడి..
Up Marriage

Up Marriage

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో హసన్‌పూర్ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, ఈ పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు మైనర్ అని తేలడంతో బాలల సంక్షేమ కమిటీ(CWC) జోక్యం చేసుకుని, 3 రోజుల్లో విచారణ ఇవ్వాలని కోరింది. కమిటీ ముందు హాజరైన వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ప్రజాధరణ, ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే ఆ ఫ్రాంక్ వీడియోను చేసినట్లు లిఖితపూర్వక ప్రకటనలో ఒప్పుకున్నారు. పోలీసులు, హిందూ సంస్థల నుంచి ఒత్తిడికి భయపడి నిజం బయటపెట్టడానికి ఆలస్యం చేసినట్లు చెప్పారు.

బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరైన దేవిక అలియాస్ సావిత్రి, ఒకటి రెండు రోజుల్లో ఆ ఫ్రాంక్ వీడియో గురించి బయటపెట్టాలన్నదే తమ ప్రణాళిక అని ఒప్పుకుంది. తామంతా నిజమైన అక్కాచెల్లెళ్లం కాదని, కజిన్స్ అని కూడా వెల్లడించింది. ఇటీవల వైరల్ అయిన వీడియోలో ముగ్గురం ఇష్టపడే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఈ వీడియో చాముండ ఆలయానికి చెందినదని ప్రచారం జరిగినప్పటికీ, అక్కడి పూజారులు అలాంటి వివాహం జరగలేదని ఖచ్చితంగా ఖండించారు. ఈ వీడియోలో హసన్‌పూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, పలువురు మహిళలు కూడా కనిపించడం వివాదానికి దారితీసింది. నిరసనల మధ్య, ఆ వివాహం నిజమైనదేనని ఆ మహిళలు పేర్కొన్నారు.