Site icon NTV Telugu

Air India: ఎయిరిండియాలో బుల్లెట్లు కలకలం

Airindia

Airindia

భారత్‌లో గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియల్‌లాగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే అక్టోబర్ 27న మాత్రం దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో బెల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. తనిఖీ చేయగా ఒక సీట్లో బుల్లెట్లు దొరికాయి. వెంటనే సిబ్బంది పైఅధికారులకు సమాచారం అందించారు. ఆ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ఎవరు..? ఏ దేశస్తుడు..? వంటి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా విమానయాన సంస్థ భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy : ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివే.. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..!

ఈ సంఘటనపై ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ.. “దుబాయ్ నుంచి వచ్చిన మా ఫ్లైట్ AI916.. అక్టోబర్ 27, 2024న ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడి సీటులో బుల్లెట్ గుర్తించాం. ప్రయాణీకులందరూ సురక్షితంగా దిగారు.’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Parliament Sessions: ఈనె 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పెద్ద ఎత్తున దుమారం ఖాయం?

Exit mobile version