Site icon NTV Telugu

Amit Shah: రాహుల్ గాంధీ నానమ్మ తిరిగి వచ్చినా అది సాధ్యం కాదు..

Amit Shah

Amit Shah

Amit Shah: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు రామ మందిరానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని ప్రతిపక్షాలు చేయలేవని అన్నారు. రాహుల్ గాంధీ నానమ్మ(ఇందిరాగాంధీ) తిరిగి భూమి పైకి వచ్చిన కూడా సీఏఏని రద్దు చేయలేరని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి ప్రతిపక్ష నేతలు సీఏఏకి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: PhonePe : గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?

ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తుందని చెప్పారు. రామమందిరం పనికిరానిదని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ చేసిన ప్రకటనపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లుగా రామాలయ సమస్యను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. మీరు నరేంద్రమోడీని రెండో సారి ప్రధాని చేసిన తర్వాత రామ మందిరం నిర్మితమైందని ఆయన అన్నారు.

సీఏఏ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీలు, సిక్కుల వంటి ముస్లింయేతర వలసదారులకు భారత పౌరసత్వం అందించనున్నారు. అయితే, ఈ మతవివక్షకు కారణం అవుతోందని ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసింది. అంతకుముందు 2019లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమెదించింది.

Exit mobile version