Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు. ఒక్కడో చోట హింస చెలరేగుతూనే ఉంది. నేడు మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
Read Also: Russia: రష్యాలో తిరుగుబాటు.. పుతిన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాని వాగ్నర్ గ్రూప్ వార్నింగ్..
మణిపూర్ లో మే 3 నుంచి వరసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడగించింది. మే 3న మణిపూర్‌లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ST) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీగా ఉండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ ఘర్షనల్లో 120 పైగా మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అమిత్ షా స్వయంగా మణిపూర్ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిటీ నాయకులతో చర్చించి శాంతిస్థాపన కోసం పిలుపునిచ్చారు. అయినా పరిస్థితి చక్కబడటం లేదు. దీనికి తోడు మయన్మార్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు హింసను మరింతగా ప్రేరేపిస్తున్నారు. ఈ హింసపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారని.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారు..ప్రధానికి ఈ భేటీ ముఖ్యం కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.