Amit Shah Strong Counter To China Over Border Issues: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనపై చైనా అభ్యంతరం చేయగా, అందుకు ఆయన తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘భారత ప్రాదేశిక సమగ్రతను’ ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని చురకలంటించారు. ‘మన భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరు’’ అని తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామం, భారతదేశానికి తూర్పు వైపున ఉన్న కిబితూ నుండి అమిత్ షా ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కి ముందు ఈశాన్య ప్రాంతమంతా అస్తవ్యస్తంగా ఉండేదని, అయితే ప్రధాని మోడీ తీసుకొచ్చిన ‘లుక్ ఈస్ట్’ విధానం కారణంగా గత 9 ఏళ్లలో ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశాభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమిత్ షా భారత సైన్యాన్ని, సరిహద్దు పోలీసులను కొనియాడారు. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో మన ఐటీబీపీ జవాన్లు, సైన్యం పగలు, రాత్రులు శ్రమిస్తున్నందున.. ఈరోజు దేశం మొత్తం ప్రశాంతంగా నిద్రపోగలుగుతోంది. ఈరోజు మన భారత్‌పై ఏ ఒక్కరూ డేగకన్ను వేయలేరని మనం గర్వంగా చెప్పుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.
Kolkata Knight Riders: కేకేఆర్ చారిత్రాత్మక రికార్డ్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి
గత వారం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగానికి చెందినవిగా చైనా పేర్కొంటూ, వాటికి పేర్లు మార్చింది. జాంగ్‌నన్ చైనా భూభాగమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. అంతేకాదు.. జాంగ్‌నన్‌లో భారతీయ అధికారులు పర్యటించడం తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం అవుతుందని.. సరిహద్దుల్లో శాంతి, సామరస్యతకు విఘాతం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అయితే.. భారత్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ దేశంలో విడదీయరాని భాగమని ఎప్పుడూ చెప్తూనే ఉంది. చైనా తన స్వంత ఆవిష్కరణ పేర్లను పెట్టడం వల్ల గ్రౌండ్ రియాలిటీ మారదని కూడా తేల్చి చెప్పింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ‘‘చైనా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాల్ని మేము తిప్పికొట్టాం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగం. చైనా ఆయా ప్రాంతాల పేర్లను మార్చినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ ఎప్పటికీ మారదు’’ అంటూ చెప్పుకొచ్చారు. మునైటెడ్ స్టేట్స్ కూడా.. స్థానిక ప్రాంతాల పేర్లు మార్చి, అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగమని చెప్పుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించింది.
KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్