Site icon NTV Telugu

Amit Shah: మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు

Amitshah

Amitshah

మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు కూడా పాకిస్థాన్‌కు చెందిన వారేనని చెప్పారు. వారి దగ్గర పాకిస్థాన్‌కు చెందిన చాకెట్లు, ఆయుధాలు లభించాయని వెల్లడించారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం విపక్షాలకు హ్యీపీగా అనిపించడం లేదని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Karnataka: ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!

ఇక పహల్గామ్‌ సూత్రధారి, కీలక నిందితుడు సులేమాన్‌ మూసాను సైన్యం హతమార్చిందని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్‌ ద్వారా భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు మట్టుబెట్టాయన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ఆ మాటే కేంద్ర పెద్దలకు కోపం తెప్పించింది.. ధన్‌ఖర్ రాజీనామా మిస్టరీ ఇదే!

సోమవారం ఉదయం శ్రీనగర్‌లోని మహాదేవ్ దట్టమైన అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా పక్కా సమాచారం సైన్యానికి అందింది. అంతే వ్యూహాలు రచించి.. 3 గంటల్లోనే పని పూర్తి కానిచ్చేశారు. మొట్టమొదటిగా కీలక సూత్రధారి సులేమాన్‌ను సైన్యం మట్టుబెట్టింది. అనంతరం మిగతా ఇద్దరు ఉగ్రవాదుల్ని కాల్చి చంపేశారు. వారి దగ్గర నుంచి విదేశీ ఆయుధాలు.. మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో మతం పేరుతో 26 మందిని ఈ ఉగ్రవాదులు చంపేశారు.

ఇది కూడా చదవండి: War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ 

Exit mobile version