NTV Telugu Site icon

Amit Shah: రాహుల్ బాబా మేముండగా ఆ పని ఎన్నటికీ జరగదు..

Amit Shah

Amit Shah

Amit Shah: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారీలు, గుజ్జర్లు, దళితులతో సహా అణగారిని వర్గాలకు రిజర్వేషన్లు అలాగే ఉంటాయని అమిత్ షా హమీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నౌషేరాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన ప్రకటనని ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్లను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Read Also: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?

“పహారీ, గుజ్జర్ బకర్వాల్, దళితులు, వాల్మీకి, ఓబీసీ వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్‌పై పునరాలోచన చేస్తామని కాంగ్రెస్, ఎన్‌సీ చెప్పాయి. రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి ఇప్పుడు వాళ్లు అభివృద్ధి చెందారని, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పారు. రాహుల్ బాబా, మేము మిమ్మల్ని రిజర్వేషన్‌ని తీసివేయనివ్వము’’ అని అమిత్ షా అన్నారు. రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేరు అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ హయాంలో జమ్మూ కాశ్మీర్ రాళ్ల దాడిని లేదని, ఉగ్రవాదుల్ని విడుదల చేయలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్తాన్‌తో చర్చలు ఉండవని చెప్పారు. పాకిస్తాన్‌తో కాకుండా మేము కాశ్మీర్ యువతతో మాట్లాడుతామని చెప్పారు. టెర్రరిస్టులు, రాళ్లు రువ్వే వారి విడుదలకు ఎన్సీ-కాంగ్రెస్ కూటమి మద్దతిస్తోందని హోం మంత్రి ఆరోపించారు. ఉగ్రవాదాన్ని భూమిలో పాతిపెడుతామని వార్నింగ్ ఇచ్చారు.