NTV Telugu Site icon

Amit Shah: మణిపూర్‌పై రేపు అమిత్ షా అత్యున్నత సమీక్ష..

Amit Shah

Amit Shah

Amit Shah: ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Read Also: Warangal Airport: మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..

ఇటీవల కుకీ మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్న పిల్లల్ని చంపడంతో మరోసారి ఉద్రిక్తతులు పెరిగాయి. మైయిటీ వర్గం సీఎం బిరెన్ సింగ్‌తో పాటు మంత్రులు, ఎమ్మె్ల్యేల ఇళ్లపై దాడులు చేసింది. 24 గంటల్లో హత్యలు పాల్పడిన మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని సీఎంకి అల్టిమేటం విధించింది.

నవంబర్ 11 న, బోరోబెక్రా ప్రాంతంలోని ఒక పోలీసు స్టేషన్‌పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది, అయితే దాడిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి, ఫలితంగా 11 మంది ఉగ్రవాదులు మరణించారు. తిరోగమనం చేస్తున్న సమయంలో, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్ సమీపంలోని సహాయక శిబిరం నుండి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మరియు ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశారు. అస్సాం సరిహద్దుల్లోని జరిబామ్ బారాక్ నది ఒడ్డున వీరి మృతదేహాలు లభించడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.