Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
- ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు
- రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
- పంజాబ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం ఢిల్లీ జల్ బోర్డ్‌కు చెందిన రూ.8,941 కోట్ల విలువైన 43 ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ విదేశీ టూర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘రాబోయే 30 ఏళ్ల వరకు మీ వంతు రాదు. మీరు ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఉన్నారు. నా మాట మీకు వినిపించదని నాకు తెలుసు. మీరు అక్కడ ఎందుకు ఉన్నారో కూడా నాకు చెప్పరు. కానీ అది మీ వ్యక్తిగత జీవితం.’’ అని అన్నారు. ‘‘మీరు ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత… నా మాట వినండి. రాబోయే 30 ఏళ్ల వరకు మీ వంతు రాదు.’ అని జోస్యం చెప్పారు.
‘‘యమునా నది ఉదాహరణనే తీసుకోండి. మీ పార్టీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంది. కానీ యమునా నదికి మీరు ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో యమునోత్రి నుంచి సంగమం వరకు యమునా నది మొత్తాన్ని శుభ్రపరిచే అదృష్టం భారతీయ జనతా పార్టీకి దక్కనుంది.’’ అని అన్నారు. చొరబాటుదారులను కాపాడాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు
Also Read
- Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
- France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
- Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
- CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
నిరసనలు, ప్రదర్శనల వల్ల ఏమీ సాధించలేమని అన్నారు. మీరు ఎన్నికైన ప్రాంత ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఈసారి పంజాబ్‌లో ఎన్డీఏనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్తల నుంచి ప్రధాని మోడీ వరకు కోట్లాది మంది కార్యకర్తలు ప్రజల మధ్య నివసిస్తూ.. వారి బాధలను అర్థం చేసుకుని, వారి సమస్యలను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తారని అన్నారు.
తాజావార్తలు
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!