Site icon NTV Telugu

Amit Shah: ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలిసింది.. బీఎస్‌ఎఫ్ దినోత్సవంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amitshah

Amitshah

ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఎస్‌ఎఫ్‌ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని భుజ్‌లోని హరిపార్‌లోని జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. తొలుత విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 1965లో బీఎస్ఎఫ్ స్థాపించబడిందని…25 బెటాలియన్లతో సరిహద్దు ప్రాంతంలో ప్రారంభమై కాలక్రమేణా విస్తరించినట్లుగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee-EC: బెంగాల్‌‌లో తక్షణమే ‘సర్’ నిలిపేయండి.. ఈసీకి మమత లేఖ

ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్, సైన్యం ధైర్యం కారణంగా పాకిస్థాన్ ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించిందన్నారు. దీంతో మన దళాల సత్తా ప్రపంచానికి స్పష్టమైందని చెప్పారు. లేకుంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే వారని తెలిపారు. జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే-ఎ-తోయిబాకు చెందిన 9 ప్రదేశాల్లో స్థాపించబడిన ప్రధాన కార్యాలయాలు, శిక్షణా శిబిరాలు, లాంచ్ ప్యాడ్‌లను నిర్మూలించారని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Al-Falah University: ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమవ్వడమే కాకుండా ఉగ్ర శిబిరాలన్నీ నాశనం అయ్యాయి. అంతేకాకుండా పాక్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం కాల్పుల విరమణ జరిగింది.

 

Exit mobile version