Jammu Kashmir: టార్గెటెడ్ కిల్లింగ్స్ పై అమిత్ షా హైలెవల్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కలకలం రేపుతున్నాయి. వరసగా కొన్ని రోజులుగా ఉగ్రవాదులు అమాయకమైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. గురువారం కాశ్మీర్ కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు వలస కార్మికులను చంపేశారు. దీంతో లోయ నుంచి కాశ్మీరి పండిట్లు పెద్ద సంఖ్యలో వలస వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ కిల్లింగ్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఈ మీటింగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ సీసీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ హాజరయ్యారు. కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్, హిందువుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉగ్రవాదుల ఏరివేతను గురించి చర్చించారు.
Also Read
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
కాశ్మీర్ లో గత వారం రోజులుగా టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ తో మొదలైన టెర్రరిస్టుల టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తరువాత హిందూ మహిళా ఉపాధ్యాయురాలితో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరగిన కొన్ని గంటల్లోనే తాజాగా బీహార్ కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను టెర్రరిస్టులు చంపారు. దీంతో లోయలోని కాశ్మీరీ పండిట్లు భయాందోళలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆందోళన చేస్తున్నారు.
తాజావార్తలు
-
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?