NTV Telugu Site icon

Amit shah And Modi: మణిపూర్‌లో పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్‌ షా

Amit Shah And Modi

Amit Shah And Modi

Amit shah And Modi: విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్‌లోని తాజా పరిస్థితుల గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌కు హామీ ఇచ్చినట్టు తెలిపారు.

Read also: Malla Reddy: ఖబడ్దార్.. కేసీఆర్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు

సంక్షోభంలో ఉన్న మణిపూర్‌ రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడానికి మణిపూర్ ప్రభుత్వం మరియు కేంద్రం తీసుకున్న చర్యలను హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఈరోజు తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ అమిత్ షాను ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి మణిపూర్‌లోని ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు హింసను నియంత్రించగలిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అమితఖ షాతో అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటానికి అన్ని విధాలా సాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

Read also: Kerala Story: కేరళ స్టోరీ టీమ్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బస్తర్’

సమస్యను అనుభవిస్తున్న ప్రజలు, సివిల్ బాడీలు, ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకులు అందరూ కలిసి కూర్చుని, కలసి పని చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం సింగ్ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. శనివారం 18 రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశానికి షా అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీ ప్రతినిధులు పట్టుబట్టారు. హింసాకాండకు గురైన రాష్ట్రంలో మొదటి రోజు నుండి పరిస్థితిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని మరియు సూక్ష్మంగా తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని హోం మంత్రి తెలిపారు. మే 3న రాష్ట్రంలో మొదటి హింసాత్మక సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 36,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించడం ద్వారా పరిస్థితులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అమిత్‌ షా తెలిపారు. మణిపూర్‌లో పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది.