NTV Telugu Site icon

Amit Shah: మోదీ ఫోటోతో ఓట్లు అడిగి.. కాంగ్రెస్,ఎన్సీపీ కాళ్లు పట్టుకున్నారు.

Amit Shah

Amit Shah

Amit Shah: శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. మోదీకి మహారాష్ట్రలో ముఖం చెల్లకే బాలా సాహెబ్ ఠాక్రే ముఖాన్ని వాడుకునేందుకు పార్టీ పేరు, ఎన్నికల చిహ్నాన్ని దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండేను దొంగగా అభివర్ణించారు.

Read Also: Taraka Ratna: నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం- ప్రధాని మోదీ

ఇదిలా ఉంటే ఉద్ధవ్ వర్గం విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. నిజం, అబద్దాన్ని ఈసీ గుర్తించిందని.. అందుకే షిండే వర్గానికి శివసేనను కేటాయించిందని అన్నారు. సత్యమేవ జయతే అనేది ఈసీ నిర్ణయంతో తెలిసిందని అన్నారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఫోటోతో ఓట్లు అడిగి, ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ కాళ్లు పట్టుకున్నారని ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో నా వెనక అమిత్ షా అండగా నిలబడ్డారని.. ఆయన నాతో ‘షిండే జీ మీరు ముందుకెళ్లండి, మేం మీ వెనక గట్టిగా నిలబడతాం’’ అని అన్నారని, ఆయన చెప్పినట్లే చేశారని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో మహారాష్ట్రలో ‘డబుల్ హార్స్‌పవర్’ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన రెండున్నరేళ్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వ పాలన వ్యర్థం అని.. మాకు మరో రెండున్నరేళ్లు మిగిలి ఉన్నాయని, చేయాల్సిన పని చాలా ఉందని ఆయన అన్నారు. గతేడాది శివసేన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు చేశారు. వీరంతా ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారు. 18 మంది ఎంపీల్లో 13 మంది షిండేకు జై కొట్టారు. దీంతో గతేడాది ఏక్ నాథ్ షిండే సీఎంగా, బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Show comments