PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు 26 మంది సాధారణ పౌరుల్ని క్రూరంగా కాల్చి చంపారు. ఉగ్రవాదులు, దాని మద్దతుదారులు ప్రపంచంలో ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ప్రధాని ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Governor Kambhampati Haribabu: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్ సూపర్ ఐడియా..!
అయితే, తాజాగా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య మరోసారి ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారిపై “కఠినమైన మరియు నిర్ణయాత్మక చర్య” తీసుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్‌కాల్వ్స్ లౌరెంకోతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో, ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారు.
పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందిన వారిగా గుర్తించింది. వీరిలో ఒకరు పాక్ ఆర్మీలో పారా కమాండోగా పనిచేసినట్లు తెలిసింది. దీంతో ఈ దాడి వెనక పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉన్నట్లు స్పష్టమైంది. ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడి జరిగింది. ఒక రోజు తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. దీని తర్వాత బీహార్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ…”మేము ప్రతి ఉగ్రవాదిని మరియు వారి మద్దతుదారులను గుర్తించి, జాడ తెలుసుకుని, శిక్షిస్తాము. మేము వారిని భూమి చివరల వరకు వెంబడిస్తాము” అని అన్నారు.
