NTV Telugu Site icon

Amazon: వీడి డెడికేషన్ తగిలెయ్యా.. పోలీస్ ఆపరేషన్ మధ్య పార్సల్ ఇవ్వడం ఏంట్రా..వీడియో వైరల్

Usa

Usa

Amazon: మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.

Read Also: Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

నార్త్ కరోలినాలోని ఓ ప్రాంతంలో పోలీసులు ఓ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఓ పార్సిల్ ను డెలివరీ చేయడానికి ఓ వ్యక్తి వెళ్లి పార్సల్ ను అందించాడు. నార్త్ కరోలినా క్యారీలో గత నెలలో ఈ ఘటన జరిగింది. ‘‘మీరు మీ వ్యాపారంలో ఉన్నప్పుడు ఏదీ మీ దారికి అడ్డురాదు’’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీస్ స్టాండ్ఆఫ్ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రదేశానికి అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెళ్తున్నారు. అయితే అతడు పార్సిల్ అందించాల్సిన ఇంటికి చేరుకోలేకపోయాడు.. కానీ స్వాట్( స్పెషల్ వెపన్ అండ్ టాక్టిస్) సభ్యుడికి పార్సిల్ అందించాడు. డెలివరీ వ్యక్తి డెడికెషన్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి నవ్వూతూ చెబుతున్నాడు.

ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. స్వాట్ బృందం సభ్యులు, ఓ సాయుధ అనుమానితుడి కోసం దాదాపుగా 24 గంటలు ప్రతిష్టంభన నెలకొంది. గుర్తు తెలియని నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రతిష్టంభన ముగిసింది.