Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది.
అయితే, ఈ ఉద్యోగాల తొలగింపు నేపథ్యంలో, ఓ వ్యక్తి అమెజాన్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడి పరిస్థితిని రెడ్డిట్‌లో పంచుకున్నారు. తన స్నేహితుడు అమెజాన్‌లో పనిచేస్తున్నాడని, ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనే భయంతో తీవ్రమైన ఆందోళనలో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నాడని చెప్పుకొచ్చాడు. రాత్రి కేవలం 2-3 గంటలే నిద్రపోతున్నాడని చెప్పాడు. ఉద్యోగం కోల్పోయిన వారికి అర్థరాత్రి లేదా తెల్లవారుజామున ఈమెయిల్ వస్తుందని విన్నాడు, దీంతో ప్రతీ రోజు ఈమెయిల్ వస్తుందేమో అనే భయంతో మెలుకువతో ఉంటున్నాడని అన్నాడు. ‘‘ఉద్యోగం పోతుందనే భయం మనుషుల మనసును ఉద్యోగం పోకముందే విరగ్గొడుతుంది’’ అని రాశాడు.
అయితే, దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అమెజాన్ ఇంటర్వ్యూను క్లియర్ చేశావంటే, వేరే కంపెనీలో కూడా ఉద్యోగం సంపాదించగలవు అంటూ ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు, పానిక్ అటాక్స్, ఇపోస్టర్ సిండ్రోమ్ అంటూ మానసిక ఆరోగ్య స్థితి గురించి చెబుతున్నారు. ఇటీవల, అమెజాన్ కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ మాట్లాడుతూ.. తాము ఏఐ, డబ్బు కోసం ఉద్యోగుల్ని తీసేయడం లేదని, ‘‘వర్క్ కల్చర్’’, స్టార్టప్‌గా ఉండేందుకు, నిర్ణయాలు త్వరగా తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
What layoff anxiety does to a blud who’s actually good at his job.
byu/firstprincipal indevelopersIndia
